Singer | Anurag Kulkarni |
Pilla Raa Lyrics in Telugu
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా? చంపడానికా?
కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే, గుండెలోని నా కసివే
చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే, సరసకు చెలి చెలి రా
ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా కళ్ళారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా
ఎల్లా విడిచి బ్రతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా కళ్ళారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే…
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా? చంపడానికా?
చిన్నాదాన, ఓసి అందాల మైనా,
మాయగ మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగినే, నీ పేరే పలికెనే,
నీలాగే కులికెనే, నిన్ను చేరగా
ఎన్నాళ్ళైనా, అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా, వేచి ఉంటాను నిన్ను చూడగా
గండాలైనా, సుడిగుండాలు అయినా
ఉంటానిలా, నేను నీకే తోడుగా
ఓ ప్రేమ, మనం కలిసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా…
అయ్యో రామ, ఓసి వయ్యారి భామ
నీవొక మరపురాని మృదుభావమే
కిల కిల నీ నవ్వు తలుకులే, నీ కళ్ళ మెరుపులే,
కవ్విస్తూ కనపడే, గుండెలోతులో
ఏం చేస్తున్నా, నేను ఏ చోట ఉన్నా,
చూస్తునే ఉన్నా, కోటి స్వప్నాల ప్రేమరూపము
గుండె కోసి, నిన్ను అందులో దాచి,
పూజించనా రక్తమందారాలతో
కాలాన్నే, మనం తిరిగి వెనకకే, తోద్దామా
మళ్ళీ మన కధనే రాద్దామా
ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా..